క్రికెట్

శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్‌తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వద్ద శనకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మలింగ. Photo Credit: The Cricket Hub/X.

శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌పై ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌, మాజీ లంక ప్లేయ‌ర్ ల‌సిత్ మలింగ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌ల్లెకెలెలో పాకిస్థాన్ తో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్ల‌లో శ‌న‌క అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఓ ద‌శ‌లో శ‌న‌క బాదుడుకు శ్రీ‌లంక గెలుస్తుంద‌ని కూడా భావించారు. చివ‌రి ఓవ‌ర్‌లో 28 ప‌రుగులు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌గా పాక్ బౌల‌ర్ ష‌హీన్ షా అఫ్రిది బౌలింగ్‌కు దిగాడు. ఈ క్ర‌మంలో అఫ్రిది వేసిన చివ‌రి ఓవ‌ర్ తొలి బంతిని శ‌న‌క ఫోర్ కొట్టాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా మూడు బంతుల‌కు మూడు సిక్స‌ర్లు బాదాడు. అయితే చివ‌రి రెండు బంతుల్లో 6 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. ఈ ద‌శ‌లో 5వ బంతిని అఫ్రిది ఆఫ్ స్టంప్ అవ‌త‌ల‌కు దూరంగా యార్క‌ర్ మాదిరిగా విసిరాడు. దాన్ని ఆడ‌డంలో శ‌న‌క విఫలం అయ్యాడు. త‌రువాత కూడా అలాంటి బంతినే వేయ‌గా శ‌న‌క అది వైడ్ అనుకుని వ‌దిలేశాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వ‌లేదు. దీంతో శ్రీ‌లంక‌పై పాక్ 5 ప‌రుగుల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న స‌మ‌యంలో డోర్ వ‌ద్ద శ‌న‌క‌ను ఆపిన మ‌లింగ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క‌నిపించారు. శ‌న‌క‌పై కోపంతో మ‌లింగ ఏదో అన్న‌ట్లు వీడియోలో క‌నిపించింది. అయితే చివ‌రి రెండు బంతుల‌ను ఎందుకు వ‌దిలేశావ‌నే అత‌నిపై మ‌లింగ అరిచి ఉంటార‌ని తెలుస్తోంది.

స్కూప్ షాట్ ఆడ‌కుండా ఉండాల్సింది..

వాస్త‌వానికి 5వ బంతిని సాధార‌ణ షాట్ ఆడి ఉంటే అది కూడా బౌండ‌రీకి వెళ్లి ఉండేది. కానీ శ‌న‌క స్కూప్ షాట్‌కు యత్నించాడు. అది ఫెయిల్ అయింది. దీంతో చివ‌రి బంతికి క‌చ్చితంగా సిక్స్ కొట్టాల్సి వ‌చ్చింది. ఇక అఫ్రిది ఆ బంతిని ఆఫ్ స్టంప్‌కు దూరంగా యార్క‌ర్ లెంగ్త్‌లో బౌల్ చేశాడు. అయితే రీప్లేలో బంతి వైడ్ అని స్ప‌ష్టంగా తేలింది. అయిన‌ప్ప‌టికీ అంపైర్ వైడ్ కాద‌ని ఇవ్వ‌డంతో శ‌న‌క చేసేదేం లేక విచారం వ్య‌క్తం చేశాడు. కానీ అంత‌కు ముందు స్కూప్ షాట్‌కు య‌త్నించ‌కుండా షాట్ అడి ఉంటే శ్రీ‌లంక క‌చ్చితంగా గెలిచి ఉండేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో కామెంటేట‌ర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే అంత వ‌ర‌కు వ‌చ్చి మ్యాచ్ గెల‌వ‌క‌పోవ‌డంతో ఆ కోపంలోనే శ‌న‌క‌పై మ‌లింగ అరిచి ఉంటార‌ని అంటున్నారు.

పోరాడి ఓడిన లంక‌..

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 212 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో షాహిబ్‌జాదా ఫ‌ర్హాన్ సెంచ‌రీతో కదం తొక్క‌గా, మ‌రో ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ కూడా 84 ప‌రుగుల‌తో రాణించాడు. కానీ ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ ఆ ఊపును కొన‌సాగించ‌లేదు. అయితే సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాలంటే పాక్‌కు ఈ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌ను 20 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో మ్యాచ్‌లో కాసేపు పాక్ బౌల‌ర్లు ఆధిప‌త్యం చెలాయించారు కూడా. కానీ శ్రీ‌లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క 76 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. మ‌రో బ్యాట‌ర్ ప‌వ‌న్ ర‌త‌నాయ‌కె కూడా 58 ప‌రుగుల‌తో స్కోరు బోర్డును ఉర‌క‌లెత్తించాడు. కానీ చివ‌రి ఓవ‌ర్‌లో శ‌న‌క అలా ఆడ‌డంతో అక్క‌డి వ‌ర‌కు వ‌చ్చి కూడా త‌న జ‌ట్టును గెలిపించుకోలేక‌పోయాడు. మ్యాచ్ అనంత‌రం శ‌న‌క కూడా తీవ్ర విచారం వ్య‌క్తం చేశాడు. కాగా ఈ గ్రూప్‌లో ఇప్ప‌టికే ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించ‌గా, పాకిస్థాన్‌, శ్రీ‌లంక జ‌ట్లు ఎలిమినేట్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM