Rashmika Mandanna : వామ్మో.. ర‌ష్మిక మంద‌న్నాకి ఐదు న‌గ‌రాల్లో ఐదు ల‌గ్జ‌రీ ఇళ్లు.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్..

February 12, 2023 10:22 AM

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. రష్మిక తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని, జస్ట్ ఈ ఐదారేళ్లలో ఆలోవర్ ఇండియా క్రేజ్ సంపాదించడమే కాదు ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ కొన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్ మెంట్స్ ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా వీటన్నింటి పై రియాక్ట్ అయ్యింది రష్మిక. తన గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవాలే అంటూ చెప్పుకొచ్చింది. నాపై వ‌చ్చే రూమర్స్ అన్ని నిజ‌మైతే బాగుండు అని కామెంట్ చేసింది రష్మిక. ఇక నేషనల్ క్రష్‏కు నెటిజన్స్ సైతం మద్దతు తెలుపుతున్నారు. ఈ ఏడాది రష్మిక వారిసు.. మిషన్ మజ్నూ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది.

Rashmika Mandanna has luxury houses in top cities
Rashmika Mandanna

వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న ఇటీవ‌ల వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. నిజం చెప్పాలంటే పుష్ప వరకు రష్మిక మందన అంటే కొందరికి ఇష్టం. పుష్ప1 తర్వాత బన్నీ అభిమానులు రష్మిక కి కూడా ఫాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన .. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఎవరు ఊహించిన విధంగా డిమాండ్ చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో త‌న క్రేజ్ మ‌రింత పెంచుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment