Nayanthara : న‌య‌న‌తార భ‌ర్త‌కి దారుణ‌మైన అవ‌మానం.. కోపంతో ర‌గిలిపోతున్న లేడీ సూప‌ర్ స్టార్..

February 11, 2023 7:21 PM

Nayanthara : సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌ని మించి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కొన్నాళ్లుగా విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌ల ఉన్న న‌య‌న్.. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార సరోగసి ఎంచుకోవడం పై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాంట్రవర్సీని నయన్ దంపతులు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుని బయట పడ్డారు. అయితే తాజాగా నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ విషయంలో ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది.

తమిళ అగ్ర హీరోతో నయనతారకి చెడినట్లు జోరుగా ప్రచారాలు న‌డుస్తున్నాయి.. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఓ మోస్త‌రు చిత్రాలు చేశాడు కాని, బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఎక్కువగా లేవు. దీనితో విగ్నేష్ చాలా కాలంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధం చేసుకున్నారు. ఇటీవ‌ల అజిత్ కి స్టోరీ లైన్ చెప్పి ఒప్పించాడు విగ్నేష్. దీనితో వీరిద్దరి కాంబినేషన్ కి అంతా సిద్ధం అయింది. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కానీ చివర్లో విగ్నేష్ కి ఊహించని షాక్ తగిలింది. కథ నచ్చలేదని అజిత్, లైకా నిర్మాతలు విగ్నేష్ ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు. నయన్ భర్తకి ఇది ఘోర అవమానమే అని చెప్పాలి.

Nayanthara very angry for Vignesh Shivan what happened
Nayanthara

గ‌త కొంత కాలంగా విఘ్నేష్ ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. కానీ చివరి దశలో అజిత్ రిజెక్ట్ చేయడంతో విగ్నేష్ జీర్ణించుకోలేకపోయాడట. పెళ్లి తర్వాత విగ్నేష్ చేస్తున్న భారీ చిత్రం కావడంతో నయనతారకి కూడా ఇది చాలా అవమానంగా అనిపించింది. ఈ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌డానికి న‌య‌న‌తార రంగంలోకి దిగిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి అస‌లు ఇందులో ఎంత నిజం ఉంది, న‌య‌న్ ఎంట్రీ ఇవ్వ‌డంతో అస‌లు స‌మ‌స్య సాల్వ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now