My Name Is Shruthi Movie Review : తెలుగులో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కథానాయిక హన్సిక. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించిన హన్సిక జూనియర్ ఖుష్బూ అని పేరు పొందింది. తమిళంలో ఆమెకు గుడి కట్టడంతో కోలీవుడ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకు క్రమక్రమంగా దూరమయ్యారు. కొంచెం విరామం తర్వాత హన్సిక ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి. ఇది హన్సిక మొదటి మహిళా ప్రాధాన్య చిత్రమిది. నవంబర్ 17న చిత్రం విడుదల కానుండగా,ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరించింది అనేది చూద్దాం. ముందుగా చిత్ర కథ విషయానికి వస్తే… మంత్రి కావాలనేది ఎమ్మెల్యే గురుమూర్తి (ఆడుకాలం నరేన్)కి 20 ఏళ్ల కలగా ఉండేది.
హైదరాబాద్ సిటీలో రహస్యంగా స్కిన్ ట్రేడింగ్ (మనుషుల చర్మాన్ని వలిచి వేరొకరికి కాస్మొటిక్ సర్జరీ) చేయడం అతని బిజినెస్. అడ్డొచ్చిన వాళ్ళను అతి కిరాతకంగా చంపడం అతని నైజం కాగా, గురుమూర్తిని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అతనికి శృతి (హన్సిక) ఫ్లాటులో దొరికిన అను (పూజా రామచంద్రన్) శవానికి సంబంధం ఏమిటి? ఈ కేసును ఏసీపీ రంజిత్ (మురళీ శర్మ) ఎలా సాల్వ్ చేశారు? అసలు, అనూని ఎవరు చంపారు? ఆమెకు, డ్రగ్ డీలర్స్, స్కిన్ ట్రేడర్స్ మధ్య సంబంధం ఏమిటి? పోలీసుల దగ్గర శృతి దాచిన నిజం ఏమిటి? ఆమె బాయ్ ఫ్రెండ్ చరణ్ (సాయి తేజ) ఎవరు? అతను ఏమయ్యాడు? అనేది చిత్ర కథ. సినిమాపై పూర్తి క్లారిటీ రావాలంటే థియేటర్‌కి వెళ్లాల్సిందే.
విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత భార్యకు స్క్రిన్ సమస్య రావడంతో కిరణ్మయి ఎంట్రీతో స్క్రిన్ గ్రాఫ్టింగ్ అనే ఓ కాస్మోటిక్ ఇండస్ట్రీ కుంభ కోణం కథ అనే లీడ్ ఇచ్చి కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఇక ఫస్టాఫ్‌లో ట్విస్టులు వదులుకొంటూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత నిదానంగా సాగింది.సెకండాఫ్‌పై పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే కథను దర్శకుడు పరుగులు పెట్టించారు. దర్శకుడి స్క్రీన్ ప్లేకు తగినట్టుగా హన్సిక ఫెర్ఫార్మెన్స్ జత కావడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వదలిన ట్విస్టులను జాగ్రత్తగా క్లోజ్ చేసుకొంటూ వెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్‌తో డీల్ చేసిన విధానం బాగుంది. మెడికల్ మాఫియా మీద వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘మే నేమ్ ఈజ్ శృతి’ ఒకటి. కాన్సెప్ట్ బావుంది. కానీ, స్టార్టింగ్ సీన్స్ అంతగా ఆకట్టుకోవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…