Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య పేరు ఇప్పుడు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ముఖ్యంగా బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా అయ్యారు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో చించేసింది. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కాస్త నెగెటివ్ అయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అయితే బేబి సినిమాలో కథానాయికగా నటించకముందు వైష్ణవి చైతన్య.. అల వైకుంటపురంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలిగా కనిపించి మెప్పించింది. టక్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను, వలిమై, ప్రేమ దేశం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ లో చేస్తూనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇక బేబీ చిత్రంతో అద్భుతమైన నటనను కనబర్చిన ఈమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది. బేబి హిట్‌తో వైష్ణవి చిత్రానికి వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో రెండు, మూడేళ్ల వరకూ ఈ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని.. ఆమెను మించిన హీరోయిన్ గా కచ్చితంగా ట్రెండ్ చేస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ భామ సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా, ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చాన్స్ కొట్టేసిందని సమాచారం.
ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్యకి సంబంధఙంచిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ ఊహించని విధంగా అమ్మడికి ఒక గిఫ్ట్ పంపించారట. వైష్ణవికి.. అల్లు అర్జున్ ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ పంపించినట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇన్‌పుట్స్‌తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్‌లో వైష్ణవి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోందట. ఈ క్రమంలోనే ఆమెకు అడ్వాన్స్ రూపంలో ఈ చెక్ పంపించారని , ఇక బన్నీ నుండి చెక్ అందుకున్న వైష్ణవి ఫుల్ ఖుష్ అయినట్టు సమాచారం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…