Vaishnavi Chaitanya : బేబి హీరోయిన్‌కి అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్.. థ్రిల్ అయిపోయిందిగా..!

November 17, 2023 5:24 PM

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య పేరు ఇప్పుడు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ముఖ్యంగా బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా అయ్యారు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో చించేసింది. వైష్ణ‌వి చైత‌న్య క్యారెక్ట‌ర్ కాస్త నెగెటివ్ అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డికి మాత్రం ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. అయితే బేబి సినిమాలో క‌థానాయిక‌గా న‌టించ‌క‌ముందు వైష్ణ‌వి చైత‌న్య‌.. అల వైకుంటపురంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలిగా కనిపించి మెప్పించింది. టక్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను, వలిమై, ప్రేమ దేశం వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.

అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ లో చేస్తూనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఇక బేబీ చిత్రంతో అద్భుతమైన నటనను కనబర్చిన ఈమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది. బేబి హిట్‌తో వైష్ణ‌వి చిత్రానికి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తుంది. మరో రెండు, మూడేళ్ల వరకూ ఈ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని.. ఆమెను మించిన హీరోయిన్ గా కచ్చితంగా ట్రెండ్ చేస్తుందని విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు. ఈ భామ సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా, ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చాన్స్ కొట్టేసిందని సమాచారం.

allu arjun gift to Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఇదిలా ఉంటే వైష్ణ‌వి చైత‌న్య‌కి సంబంధ‌ఙంచిన ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. అల్లు అర్జున్ ఊహించని విధంగా అమ్మ‌డికి ఒక గిఫ్ట్ పంపించారట. వైష్ణవికి.. అల్లు అర్జున్ ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ పంపించినట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇన్‌పుట్స్‌తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్‌లో వైష్ణవి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోందట. ఈ క్రమంలోనే ఆమెకు అడ్వాన్స్ రూపంలో ఈ చెక్ పంపించారని , ఇక బ‌న్నీ నుండి చెక్ అందుకున్న వైష్ణ‌వి ఫుల్ ఖుష్ అయిన‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now