Mega Family : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగిన విషయం మనకి తెలిసిందే. వరుణ్ తేజ్ పెళ్లితో, మెగా ఫ్యామిలీ ఫుల్ బిజీ అయిపోయింది. మెగా బ్రదర్స్, సిస్టర్స్ ఇలా అందరూ కుటుంబ సమేతంగా, కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు అల్లు ఫ్యామిలీ కూడా ఇటలీ వెళ్ళింది. బన్నీ, స్నేహ రెడ్డి కూడా, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగబాబు ఇంకో ఫోటోని షేర్ చేసి, సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
మెగా బ్రదర్స్ బంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల పరంగా కొంచెం వేరువేరుగా అనిపించినా కూడా, వాళ్ళు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు. పవన్ కళ్యాణ్ జనసేన కి చిరు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా సపోర్ట్ పలకకపోయినా, తమ్ముడు అనుకున్న స్థాయికి చేరాలని, కోరుకునే పదవి రావాలన్నట్లుగా ఆయన ఎప్పుడూ కూడా అనుకుంటారు. మెగా బ్రదర్స్ బంధం గురించి నాగబాబు ఒక పోస్ట్ చేశారు.
విభేదాలు మా మద్య ఉన్న భిన్న వాదనలు వచ్చినప్పటికీ, మా బంధం నిజంగా ప్రత్యేకమైనది. ఇవన్నీ కూడా మేము చేసిన పనులు కాదు. మాకు ఇవన్నీ జ్ఞాపకాలు. ఎన్ని విభేదాలు వచ్చినా, మా బంధం ఎప్పుడు దృఢంగానే ఉంటుంది. మా సంబంధం అనేది ప్రేమతో నిర్మితమైంది. ఎన్ని జరిగినా కూడా మమ్మల్ని ఒకటే గాడిన కట్టిపడే ఆ కనెక్షన్ అంటే నాకు ఎంతో ఇష్టం అని నాగబాబు ఆ పోస్టులో చెప్పారు.
ప్రస్తుతం నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆత్మీయంగా మాట్లాడుతూ, నవ్వుతూ ఉన్న ఫోటో వస్తే కూడా చూడాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…