Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు చెబితే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు. హిట్ 2 బ్యూటీ అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తనదైన అందం, నటన, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ ఇటీవలి కాలంలో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. తెలుగులో సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో కథానాయికగా నటించిన ఈ అందాల భామ ఇందులో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇందులో మీనాక్షి పర్‌ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక రవితేజతో కలిసి ఖిలాడి అనే చిత్రం చేయగా, ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మీనాక్షికి పెద్దగా మార్కులు పడలేదు.అనంతరం అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి హీరోయిన్ గా నటించింది.
హిట్ 2 సినిమాలో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాతే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారంలో ఛాన్స్ దక్కించుకుంది. మొదట గుంటురు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో.. మీనాక్షికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ సినిమాతో ఈ భామ ఫేట్ మారిపోయింది అని చెప్పాలి .గుంటూరు కారం సినమా అవకాశం ఎప్పుడైతే ఈ అమ్మడికి దక్కిందో మీనాక్షికి పెద్ద హీరోల సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి గుంటూరు కారం కాకుండా మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమా అవకాశలు వచ్చినట్టు తెలుస్తుంది.
విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా ఎంపిక కాగా, వరుణ్ తేజ్ మట్కా సినిమాలోనూ ఈ అమ్మడే కథానాయిక.. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా, సింగపూర్ సెలూన్ అనే తమిళ సినిమాలోను ఈ ముద్దుగుమ్మకి ఛాన్స్ దక్కింది. ఇక ఈ ముద్దుగుమ్మకి అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కినట్టు టాక్.త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయి్ గా ఫిక్స్ చేశారట . మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.మరి ఇదే నిజమైతే మాత్రం మీనాక్షి పంట పండినట్టే చెప్పాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…