Meenakshi Chaudhary : మీనాక్షి చౌద‌రి ల‌క్ తోక తొక్కిందిగా.. ఏకంగా పాన్ ఇండియా హీరో సినిమా ఛాన్స్ ద‌క్కించుకుందిగా..!

November 11, 2023 1:25 PM

Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు చెబితే ఠ‌క్కున గుర్తుకు రాక‌పోవ‌చ్చు. హిట్ 2 బ్యూటీ అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. త‌న‌దైన అందం, నటన, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ భామ ఇటీవ‌లి కాలంలో వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది. తెలుగులో సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అందాల భామ ఇందులో త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది. ఇందులో మీనాక్షి ప‌ర్‌ఫార్మెన్స్ కి మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక రవితేజతో కలిసి ఖిలాడి అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో మీనాక్షికి పెద్ద‌గా మార్కులు ప‌డ‌లేదు.అనంత‌రం అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రంలో మీనాక్షి హీరోయిన్ గా నటించింది.

హిట్ 2 సినిమాలో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాతే త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న‌ గుంటూరు కారంలో ఛాన్స్ ద‌క్కించుకుంది. మొదట గుంటురు కారం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో.. మీనాక్షికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ సినిమాతో ఈ భామ ఫేట్ మారిపోయింది అని చెప్పాలి .గుంటూరు కారం సినమా అవ‌కాశం ఎప్పుడైతే ఈ అమ్మ‌డికి ద‌క్కిందో మీనాక్షికి పెద్ద హీరోల సినిమాల అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి గుంటూరు కారం కాకుండా మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమా అవ‌కాశ‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

Meenakshi Chaudhary got a chance in pan india hero movie
Meenakshi Chaudhary

విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా ఎంపిక కాగా, వరుణ్ తేజ్ మట్కా సినిమాలోనూ ఈ అమ్మ‌డే క‌థానాయిక‌.. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా, సింగపూర్ సెలూన్ అనే తమిళ సినిమాలోను ఈ ముద్దుగుమ్మ‌కి ఛాన్స్ ద‌క్కింది. ఇక ఈ ముద్దుగుమ్మ‌కి అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ ద‌క్కిన‌ట్టు టాక్.త్రివిక్ర‌మ్- అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్క‌నున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయి్ గా ఫిక్స్ చేశారట . మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.మ‌రి ఇదే నిజ‌మైతే మాత్రం మీనాక్షి పంట పండిన‌ట్టే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now