Kiara Advani : వామ్మో.. పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంటా..?

February 14, 2023 4:18 PM

Kiara Advani : కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన కియారా అద్వానీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జంట ఎట్ట‌కేల‌కు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యగర్హ్‌ ప్యాలేస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌లోని పలువురు సినీ సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరయ్యారు. అనంత‌రం ప్రేమజంట గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించింది. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వెడుకకు బాలీవుడ్‌ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ఇక ఇప్పుడు కియారా అద్వానీ- సిద్ధార్థ్ పెళ్లి, రిసెప్ష‌న్ వేడుక‌ల‌కి సంబంధించిన ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో బాలీవుడ్ న‌టుడు, సినీ క్రిటిక్‌గా చెప్పుకునే కేఆర్కే వీరి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. . తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ కేఆర్కే సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం చెప్ప‌క‌పోవ‌డంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ్ కాబ‌ట్టి వారిని ఉద్దేశించే అత‌డు ఆ ట్వీట్ చేశాడా అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Kiara Advani may be pregnant before marriage
Kiara Advani

గతంలో ఆలియా భట్ ఇలానే గర్భం దాల్చాక పెళ్లి చేసుకుందనే వార్తలు విన్నాం. అన్నట్లుగానే పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది ఆలియా. ఈ ఇష్యూ జనాల్లో ఎంతో పెద్ద‌ డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు కియారా కూడా అదే బాటలో వెళుతుందన్నట్లు టాక్ రావడం గమనార్హం. మ‌రి దీనిపై కియారా దంప‌తులు ఏమైన స్పందిస్తారా అన్న‌ది చూడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment