Jr NTR : నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎట్టకేలకు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. ఇటీవలే మోక్షజ్ఞ తన శరీరాన్ని పూర్తిగా మేకోవర్ చేసుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దీంతో సినిమాల్లోకి ఎంట్రీ కోసమే మోక్షజ్ఞ అలా చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు ఇప్పుడు నిజమే అయ్యాయి. త్వరలోనే మోక్షజ్ఞ వెండితెరపై కనిపించనున్నాడు.
ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాను హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. ప్రశాంత్ వర్మ ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. హనుమాన్ 2కు దర్శకత్వం వహిస్తుండడంతోపాటు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్‌ను ప్రశాంత్ వర్మ వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో అధీరా అనే సినిమా రాబోతోంది. అయితే ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి ఒక సినిమా చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల రణ్‌వీర్‌సింగ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై పోస్టు పెట్టారు. నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకు దర్వకత్వం వహిస్తుండడం సంతోషంగా ఉంది, మోక్షజ్ఞ తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే మోక్షజ్ఞ సోదరులు అయిన జూనియర్ ఎన్‌టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా ట్విట్టర్ వేదికగా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు. మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలు చెబుతూ అతను తమ తాత సీనియర్ ఎన్‌టీఆర్‌లా నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామని వారు వేర్వేరుగా పోస్టులు పెట్టారు.
అయితే మోక్షజ్ఞ ఎట్టకేలకు తెరంగేట్రం చేస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. అప్పట్లో మోక్షజ్ఞ లుక్ ను చూసి అభిమానులు బెంబేలెత్తిపోయారు. కానీ ఈ మధ్యే మేకోవర్ అయి స్టైలిష్‌గా మారిపోయాడు. దీంతో సినిమాల్లో కన్‌ఫామ్ అనుకుంటుండగానే సడెన్‌గా సినిమా ఎంట్రీని అనౌన్స్ చేసేశారు. ఇక మోక్షజ్ఞ వెండితెరపై ఎలా నటిస్తాడో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…