Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దఢఖ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు హృదయాలని కొల్లగొడుతుంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగోడుతున్న జాన్వీ కపూర్ ఓ వ్యక్తితో ప్రేమాయణం కూడా నడిపిస్తుందనే టాక్ కూడా ఉంది. జాన్వీ కపూర్ గత కొద్ది రోజులుగా షికార్ పహారియాతో తెగ చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు. తాజాగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరుడి గుడిని వీరిద్దరి దర్శించారు. వీరితో పాటు ఒక తమిళ దర్శకుడు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక ప్రాంతాలకి వెళుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య తిరుపతిలో కూడా ఈ అమ్మడు ప్రత్యక్షం అయింది. అయితే తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ గుడికి వెళ్లింది. కానీ తను ఒంటరిగా కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ షికార్ పహారియాను కూడా తీసుకెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరితో అట్లీ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జాన్వీ, అట్లీ కలిసి సినిమా చేసింది లేదు. అయినా వీరిద్దరు కలిసి గుడికి ఎందుకు వెళ్లారు అంటూ నెట్టింట్లో చర్చ మొదలయ్యింది. జాన్వీ కపూర్ చివరిగా ‘బవాల్’ అనే చిత్రంలో నటించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే చిత్రంలో నటిస్తోంది. ‘దేవర’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమవుతోంది.
ఇప్పుడు అట్లీతో గుడిలో కనిపించడంతో తను దర్శకత్వం వహిస్తున్న తరువాతి సినిమాలో జాన్వీనే హీరోయిన్ అయ్యింటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తెలుగు డెబ్యూ చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు తమిళ డెబ్యూకి కూడా సిద్ధమైందా అనే చర్చ మొదలైంది.ఇక ఇదిలా ఉంటే జాన్వీ బాయ్ ఫ్రెండ్ షికార్ పహారియా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుషీకుమార్ షిండే మనవడు. అయితే దాదాపు గత సంవత్సరం నుంచి జాన్వీ, షికార్ కలిసే కనిపిస్తున్నారు. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ ఏనాడు హింట్ కూడా ఇవ్వలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…