Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి జాన్వీ క‌పూర్ ప్ర‌త్యేక పూజ‌లు.. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్నారా ఏంటి..?

December 6, 2023 9:45 PM

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ద‌ఢ‌ఖ్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ చేస్తూ కుర్ర‌కారు హృద‌యాలని కొల్ల‌గొడుతుంది. త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగోడుతున్న జాన్వీ క‌పూర్ ఓ వ్య‌క్తితో ప్రేమాయ‌ణం కూడా న‌డిపిస్తుంద‌నే టాక్ కూడా ఉంది. జాన్వీ క‌పూర్ గ‌త కొద్ది రోజులుగా షికార్ పహారియాతో తెగ చక్క‌ర్లు కొడుతుంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు. తాజాగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరుడి గుడిని వీరిద్దరి దర్శించారు. వీరితో పాటు ఒక తమిళ దర్శకుడు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక ప్రాంతాల‌కి వెళుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆ మ‌ధ్య తిరుప‌తిలో కూడా ఈ అమ్మ‌డు ప్ర‌త్య‌క్షం అయింది. అయితే తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ గుడికి వెళ్లింది. కానీ తను ఒంటరిగా కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ షికార్ పహారియాను కూడా తీసుకెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరితో అట్లీ ఉండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. జాన్వీ, అట్లీ క‌లిసి సినిమా చేసింది లేదు. అయినా వీరిద్దరు కలిసి గుడికి ఎందుకు వెళ్లారు అంటూ నెట్టింట్లో చర్చ మొదలయ్యింది. జాన్వీ క‌పూర్ చివ‌రిగా ‘బవాల్’ అనే చిత్రంలో నటించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే చిత్రంలో నటిస్తోంది. ‘దేవర’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమవుతోంది.

Janhvi Kapoor done pooja in a temple with her boy friend
Janhvi Kapoor

ఇప్పుడు అట్లీతో గుడిలో కనిపించడంతో తను దర్శకత్వం వహిస్తున్న తరువాతి సినిమాలో జాన్వీనే హీరోయిన్ అయ్యింటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తెలుగు డెబ్యూ చేసిన జాన్వీ క‌పూర్ ఇప్పుడు త‌మిళ డెబ్యూకి కూడా సిద్ధ‌మైందా అనే చర్చ మొద‌లైంది.ఇక ఇదిలా ఉంటే జాన్వీ బాయ్ ఫ్రెండ్ షికార్ పహారియా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుషీకుమార్ షిండే మనవడు. అయితే దాదాపు గత సంవత్సరం నుంచి జాన్వీ, షికార్ కలిసే కనిపిస్తున్నారు. వీరిద్ద‌రు రిలేష‌న్ లో ఉన్నారంటూ ఏనాడు హింట్ కూడా ఇవ్వ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now