Mansur Ali Khan : సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల తెగ వార్తలలో నిలిచాడు. తన పరువుకు నష్టం కలిగిందని చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేసి కోర్టు మెట్లు ఎక్కిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టులో మన్సూర్ అలీఖాన్ వేసిన పరువు నష్టం దావా పై విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు మన్సూర్ అలీ ఖాన్ కు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం కొసమెరుపు. అంతేకాదు మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటయిపోయింది అని వ్యాఖ్యానించిన హైకోర్టు ధర్మాసనం ప్రతిసారి వివాదాన్ని రేకెత్తించి ఆ తర్వాత నేను అమాయకుడిని అని చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు ధర్మాసనం ఆయనకు అక్షింతలు వేసింది.
నిజానికి కేసు మన్సూర్ అలీఖాన్‌పై త్రిష వేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, మన్సూర్ అలీఖాన్‌కు నిత్యం వివాదాల్లోకి దూరడం.. అంతాచేసి తనను తాను అమాయకుడినని చెప్పుకోవడం అలవాటుగా మారిందని న్యాయమూర్తి నిందించారు. మన్సూర్ అలీఖాన్ న్యాయవాది తన క్లయింట్ తప్పేమీ లేదని వాదించారు. ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్ కట్ చేసి తన క్లయింట్‌పై నిందలు వేశారన్నారు. అలా అయితే, ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోర్టుకు చూపించాలని న్యాయమూర్తి అడిగారు. దీనికి మన్సూర్ అలీఖాన్ న్యాయవాది అంగీకరించారు. తాను పూర్తి వీడియోను కోర్టుకు సమర్పిస్తానని.. అయితే, మన్సూర్‌పై త్రిష చేసిన సోషల్ మీడియా పోస్టు తీసేయాలని న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. త్రిష, ఖుష్బూ, చిరంజీవి వారి స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. కేసును డిసెంబర్ 22కు వాయిదా వేశారు.
ఇక వివాదం విషయానికి వస్తే.. ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ లియో చిత్రం గురించి మాట్లాడుతూ, లియో చిత్రంలో నేను చేసే సన్నివేశాలలో ఒక సన్నివేశం కూడా త్రిషతో చేయలేదని, ఒక బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నానన్నారు. అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్ రూమ్ కి తీసుకు వెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. ఇంతకుముందు చాలా సినిమాలలో తాను రేప్ సీన్లు చేశానని, కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలే ఆయనపై చిరంజీవి, ఖుష్బూ తదితరులు తీవ్రంగా స్పందించేలా చేశాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…