ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన మాస్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొదటి భాగం ఊహించని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లో కూడా డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 లో నటిస్తున్నాడు. పార్ట్ 2 పుష్ప ది రూల్ సినిమా పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వెళ్తే అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగోత్రి సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. గంగోత్రి చిత్రం కన్న మొదటి గా బన్నీ ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట. ఆ సినిమా ఏంటంటే..
తేజ దర్శకత్వంలో నితిన్, సద హీరో హీరోయిన్ లు గా నటించిన జయం. అయితే ఈ సినిమాలో మొదటిగా అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట. జయం చిత్రంతో అల్లు అర్జున్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట దర్శకుడు తేజ.
కానీ ఆ అవకాశం కాస్త రాఘవేంద్రరావు దక్కించుకున్నారు. అప్పటికే బన్నీని రాఘవేంద్రరావు గంగోత్రి సినిమా కోసం సంప్రదించడం జరిగింది. దాంతో నైజాం ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్ ను హీరోగా జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు తేజ. సరికొత్త కథాంశంతో క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన జయం చిత్రం జూన్ 14, 2002 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…