ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథను మలచుకుంటుంటారు రచయితలు . కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి జరుగుతుంటాయి. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. దర్శకుడు వారు ఊహించుకున్న హీరోకి కథ నచ్చకపోవడం, లేకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటివి కారణాలు కావచ్చు. అప్పుడప్పుడూ ఒక హీరో వదులుకున్న ఆ చిత్రాలే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.
2003 లో ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్రాలలో ఠాగూర్ చిత్రం కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రం అవినీతిని అరికట్టే పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో చిరంజీవి ఈ చిత్రంలో చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. చిరంజీవి ఠాగూర్ చిత్రంలో చెప్పే ప్రతీ డైలాగ్ కు చూసే ప్రేక్షకులతో థియేటర్లలో విజిల్స్ వేయించాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. షియాజీ షిండే, ప్రకాష్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, సునీల్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రతి ఒక్కరు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తమిళంలో సక్సెస్ ను అందుకున్న రమణ చిత్రానికి రీమేక్ నే మన తెలుగు ఠాగూర్ చిత్రం.
కానీ ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఒక హీరో మిస్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశారు. అతనే యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. మొదట ఠాగూర్ చిత్ర కథను దర్శకుడు వి.వి.వినాయక్ హీరో రాజశేఖర్ కి వినిపించాడట. కానీ అదే టైమ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్ ఠాగూర్ చిత్రాన్ని వదులుకోవడం జరిగింది. ఆ టైం లో రాజశేఖర్ ఆయుధం చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందువలన ఠాగూర్ చిత్రానికి నో చెప్పేసారు రాజశేఖర్.
దాంతో అదే కథ మెగాస్టార్ చెంతకు వెళ్ళింది. చిరుకి కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా వి.వి వినాయక్, చిరంజీవి కాంబినేషన్లో ఠాగూర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఠాగూర్ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే అప్పటిలో ఠాగూర్ వంటి సక్సెస్ ఫుల్ కథాంశాన్ని రాజశేఖర్ నుండి చిరంజీవి లాక్కున్నారని వార్తలు బాగా చెక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…