అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ధరించిన ఈ చీర ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..!

October 28, 2022 3:30 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి గురించి అందరికీ తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్‌ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో దూసుకుపోతుంది. బన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. స్నేహారెడ్డి మంచి ఫిట్‌నెస్‌ మెయింటైన్‌ చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తాజాగా సిల్వర్ కలర్ డిజైనర్ శారీలో స్నేహారెడ్డి మెరిశారు. ఈ అద్భుతమైన చేప పొలుసుల ఆకారంలో తెల్లగా మెరుస్తున్న చీర ఖరీదు ఎంత అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆ చీర ధర ఏకంగా రూ.1,69,900 రూపాయలట.. బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ రేంజ్ లోనే తన దస్తులు, భార్యకు సొబగులు అందిస్తున్నాడట. అందుకే ఇంత ఖరీదైన చీరకట్టిన అల్లు స్నేహ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

స్నేహారెడ్డి అందం స్టార్ హీరోయిన్స్ ని కూడా డామినేట్ చేసేలా ఉంది. స్టైలిష్ స్టార్ వైఫ్ గా స్టైలిష్ లుక్ లో ఆమె కట్టిపడేశారు. అల్లు అర్జున్ భారీగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం స్నేహారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాగా 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం జరిగింది. అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులకు అల్లు అయాన్, అల్లు అర్హలు సంతానంగా  ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప..ది రూల్‌ లో నటిస్తున్నాడు. పుష్పకి మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now