Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి .. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని చాలా ప్రోత్సహిస్తున్నారు. బిగ్ బాస్ షో ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అవుతుండడమే కాదు, ఆయన సినిమాలలో కంటెస్టెంట్స్‌కి ఛాన్స్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే దివికి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పిన చిరు.. లోబోను కూడా భోళా శంకర్‌లో తీసుకున్నారు. అంతేకాదు లోబోని తన దగ్గరకు పిలిపించుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు.
అయితే ఈ ఏడాది బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ యాంకర్ రవి, లోబోతో కలిసిన చిరు పిక్ ఒకటి బయటికి వచ్చింది. అయితే ఇది బహుశా దర్శకుడు బాబీతో సినిమా ఏమో కానీ మెగాస్టార్ మాత్రం సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. రవికి కూడా చిరు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారా.. అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా లోబో తండ్రయ్యాడు. ఈ శుభవార్తను అతను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆయన పోస్ట్ కూడా వైరల్ అయింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…