Chiranjeevi : చిరుతో ఫొటో దిగిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. వైర‌ల్‌గా మారిన ఫొటో..!

December 12, 2021 1:56 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి .. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని చాలా ప్రోత్స‌హిస్తున్నారు. బిగ్ బాస్ షో ఫినాలే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రు అవుతుండ‌డ‌మే కాదు, ఆయ‌న సినిమాల‌లో కంటెస్టెంట్స్‌కి ఛాన్స్‌లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే దివికి త‌న సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పిన చిరు.. లోబోను కూడా భోళా శంక‌ర్‌లో తీసుకున్నారు. అంతేకాదు లోబోని త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

Chiranjeevi with anchor ravi and lobo

అయితే ఈ ఏడాది బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ యాంకర్ ర‌వి, లోబోతో కలిసిన చిరు పిక్ ఒకటి బయటికి వచ్చింది. అయితే ఇది బహుశా దర్శకుడు బాబీతో సినిమా ఏమో కానీ మెగాస్టార్ మాత్రం సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫొటోను చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ర‌వికి కూడా చిరు త‌న సినిమాలో ఛాన్స్ ఇచ్చారా.. అంటూ నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా లోబో తండ్రయ్యాడు. ఈ శుభవార్తను అతను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆయ‌న పోస్ట్ కూడా వైర‌ల్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now