Chiranjeevi Net Worth : మెగాస్టార్ చిరంజీవి ఆస్తి మొత్తం ఎంత ఉందో తెలుసా.. రాజకీయాల కార‌ణంగా ఎంత కోల్పోయారంటే..?

February 16, 2023 11:09 AM

Chiranjeevi Net Worth : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్‌గా ఏక‌చ‌క్రాధిప‌త్యం వ‌హిస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. స్వ‌యంకృషితో ఎదిగిన చిరు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించారు. చిన్న హీరోగా మొదలు పెట్టి తెలుగు సినిమాను శాశించే స్థాయికి వెళ్ళారు చిరంజీవి. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు సినిమాలు చేస్తున్నారంటే ఆయ‌న రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇన్నేళ్ళ సినిమా, రాజకీయ జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఒకప్పుడు చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఘరానా మొగుడు సినిమాకు ఆయనకు కోటి రూపాయలు ఇచ్చారు.

ఇక రీఎంట్రీ లోను అద‌ర‌గొడుతున్న చిరు త‌న సినిమాకి అల‌వ‌కోగా వంద కోట్ల క‌లెక్ష‌న్స్ తెప్పిస్తున్నాడు. చిరంజీవి ఇన్నేళ్ల కెరీర్‌లో బాగానే కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ నగరాల్లో భారీగా భవనాలు, స్థిరాస్తులు ఉన్నాయి. సినిమా పరిశ్రమ హైదరాబాద్ రాకముందు చిరంజీవి కుటుంబంతో కలిసి చెన్నై లో ఉండ‌గా. అక్కడ కూడా చిరంజీవి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఇక హైదరాబాద్ లో విలాసవంతమైన ఫాం హౌస్ లు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి భారీగానే పెట్టుబడులు పెట్టారు.

Chiranjeevi Net Worth properties and assets
Chiranjeevi Net Worth

ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుండ‌గా, 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ ఆస్తులలో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు అని, 3 కోట్ల రూపాయల ఆస్తులు చరాస్తులు అని సమాచారం. ఇక ఆయ‌న భార్య‌పై ఆరు కోట్ల రూపాయ‌ల ఆస్తి ఉంద‌ని పేర్కొన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డే కాక తమిళనాడు రాష్ట్రంలో కూడా చిరు ఆస్తులు బాగానే కూడ‌బెట్టాడ‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment