Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లోకి అచ్చమైన ఆడపిల్లలా వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది ప్రియాంక సింగ్. ట్రాన్స్‌జెండర్ అని చెబితేగానీ తెలియని ప్రియాంక సింగ్ మనిషి, మాట, మనసు అన్నీ ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఉండడానికి కారణమయ్యాయి. ఆమె 90 రోజుల బిగ్ బాస్ జర్నీ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు సీజన్‌లో వచ్చిన తమన్నా సింహాద్రి మాదిరిగా ఈమె కూడా ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదనుకున్నారు. కానీ తానేంటో అందరికీ తెలియజెప్పింది.
జబర్ధస్త్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షోతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ ఇన్ని రోజులూ హౌస్‌లో ఉంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ప్రియాంక బయటకు రావడం ఒకరకంగా హౌస్‌మేట్స్‌తోపాటు ప్రేక్షకులని కూడా భావోద్వేగానికి గురి చేసింది. 13వ కంటెస్టెంట్‌గా బయటకు వచ్చిన ప్రియాంకకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్‌ని కలిసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. క్రౌడ్ ఎక్కువ కావడంతో ప్రియాంక సింగ్ కళ్లు తిరిగి కింద పడిపోయింది. అయితే పక్కనున్న వాళ్ల సాయంతో వెంటనే లేచి కొన్ని వాటర్ తాగాక మళ్లీ మాములు మనిషి అయింది. అందరినీ నవ్వుతూ పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బిగ్ బాస్ షో వల్ల ప్రియాంక పాతిక లక్షలు సంపాదించినట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…