Categories: వినోదం

Samantha : యశోదగా మారిన సమంత.. ఆఫర్స్‌ ఏమాత్రం తగ్గడం లేదుగా..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత క్రేజ్ విడాకుల త‌ర్వాత కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో ఆద‌ర‌ణ‌, సినిమాల ఆఫ‌ర్స్ చూసి అంద‌రూ షాక్ అవుతున్నారు. చివ‌రిగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే సినిమా చేసిన స‌మంత ఈ చిత్రంలో శకుంతలగా నటించిన‌ విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ మహిళా ప్రాధాన్యమున్న పాత్రతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియ‌ల్‌కు త‌గ్గ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీ భాషలోనూ రూపొందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించనున్నారు.

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో రూపొంద‌నుంద‌ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది.

పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుందని ఆయ‌న అన్నారు. మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. య‌శోద‌గా స‌మంత ఎలా అల‌రించ‌నుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM