Bigg Boss 5 : అభిమానుల తాకిడి.. క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయిన ప్రియాంక సింగ్..

December 6, 2021 6:00 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అచ్చ‌మైన ఆడ‌పిల్ల‌లా వ‌చ్చి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది ప్రియాంక సింగ్. ట్రాన్స్‌జెండర్ అని చెబితేగానీ తెలియని ప్రియాంక సింగ్ మనిషి, మాట, మనసు అన్నీ ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇన్ని రోజులు ఉండడానికి కారణమయ్యాయి. ఆమె 90 రోజుల బిగ్ బాస్ జ‌ర్నీ చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇంతకు ముందు సీజన్‌లో వచ్చిన తమన్నా సింహాద్రి మాదిరిగా ఈమె కూడా ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదనుకున్నారు. కానీ తానేంటో అంద‌రికీ తెలియ‌జెప్పింది.

Bigg Boss 5 priyanka singh lost consciousness for a while

జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త ద‌గ్గ‌రైన ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షోతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ ఇన్ని రోజులూ హౌస్‌లో ఉంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ప్రియాంక బ‌య‌ట‌కు రావ‌డం ఒకరకంగా హౌస్‌మేట్స్‌తోపాటు ప్రేక్ష‌కుల‌ని కూడా భావోద్వేగానికి గురి చేసింది. 13వ కంటెస్టెంట్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రియాంక‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ప్రియాంక సింగ్‌ని క‌లిసేందుకు అభిమానులు భారీ ఎత్తున త‌రలి వ‌చ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. క్రౌడ్ ఎక్కువ కావ‌డంతో ప్రియాంక సింగ్ క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయింది. అయితే ప‌క్క‌నున్న వాళ్ల సాయంతో వెంట‌నే లేచి కొన్ని వాట‌ర్ తాగాక మ‌ళ్లీ మాములు మనిషి అయింది. అంద‌రినీ న‌వ్వుతూ ప‌ల‌క‌రించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. బిగ్ బాస్ షో వ‌ల్ల ప్రియాంక పాతిక ల‌క్ష‌లు సంపాదించిన‌ట్లు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment