Vijayashanti : నందమూరి నటసింహం బాలకృష్ణ, లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి కాంబినేషన్ లో ముద్దుల కృష్ణయ్య, భలేదొంగ, కథానాయకుడు, అపూర్వ సహోదరులు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అంతేకాదు బాలయ్యతో నిప్పురవ్వ మూవీని కూడా విజయశాంతి నిర్మించి అందులో హీరోయిన్ గా చేసింది.
బాలయ్య, విజయశాంతి హీరో హీరోయిన్స్ గా బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. పోలీసాఫీసర్ పాత్రలో బాలయ్య నటన, డైలాగులు అదరగొట్టాయి. ఇందులో విజయశాంతికి మంచి రోల్ వచ్చింది. ఒక చోట ఫైట్ కూడా చేస్తుంది. అయితే సినిమా ఎడిటింగ్ సమయంలో లెంగ్త్ ఎక్కువ కావడంతో విజయశాంతి ఫైటింగ్ సీన్ తీసేయాలని డైరెక్టర్ బి గోపాల్ భావించారు.
ఇదే విషయాన్ని బాలయ్యతో చెప్పడంతో ఆ అమ్మాయి కష్టపడి చేసిన ఫైట్ తీసేస్తే ఎలా.. కావాలంటే నా ఫైటింగ్ సీన్ ఒకటి తీసెయ్యండి అని బాలయ్య చెప్పడంతో డైరెక్టర్ నిర్ఘాంతపోయారట. యథాతథంగా విజయశాంతి ఫైట్ ఉంచేశారు. సాధారణంగా హీరోయిన్ కన్నా పైచేయి ఉండాలని చాలామంది హీరోలు భావిస్తారు. కానీ బాలయ్య దానికి భిన్నంగా ఉంటారనడానికి ఇదొక తార్కాణం అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…