స‌మంత, నాగ చైత‌న్య బాట‌లో విడాకుల‌కి సిద్ధ‌మైన యంగ్ హీరో..?

February 12, 2023 8:38 AM

టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్నారు స‌మంత, నాగ చైతన్య‌. ఈ ఇద్ద‌రు 2017లో పెళ్లి చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఏమైందో ఏమో కాని 2021 అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ నిర్ణ‌యం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక ఎప్పుడైతే నాగ చైతన్యతో విడాకుల ప్రకటన చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో నిత్యం సమంత పేరు వినిపిస్తోంది. ఏదో ఒక రూపంలో సమంతపై వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏదో ఒకలా చై సామ్ లను లింక్ చేస్తూ వార్తలు రాస్తున్నారు గాసిప్ రాయుళ్లు. మ‌రోవైపు చై, స‌మంత‌లా కొంద‌రు విడాకులు తీసుకుబోతున్నారంటూ కూడా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఓ యంగ్ హీరో పెళ్లై రెండేళ్లు కాకుండానే విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ప్ర‌స్తుతం యంగ్ హీరోల‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్న ఆ హీరో ఇటీవ‌ల వ‌రుస‌గా సక్సెస్ లను కూడా దక్కించుకుంటున్నాడు. అయితే అత‌ని కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. వ్యక్తగతంగా మాత్రం తప్పుడు నిర్ణయాలనే తీసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు విడాకులకు తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. అందుకు కార‌ణం త‌ను న‌టించిన సినిమాల‌లోని హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌డం.

another young hero reportedly taking divorce

త‌న‌తో రెండు సినిమాల‌లో న‌టించిన హీరోయిన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌డం వ‌ల‌న భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు 6 నెలల నుంచి ఆ యంగ్ హీరో, ఆయన భార్య వేర్వేరుగానే ఉంటున్నారు. భర్త నుంచి విడాకులు కావాలని కూడా ఆమె కోరుకుంటుంది . మ‌రి హీరోయిన్ మోజులో ప‌డి త‌న పెళ్లిని పెటాకులు చేసుకునేందుకు సిద్ధమయిన ఆ హీరో ఎవ‌రు అనే విష‌యం త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now