Allu Arjun : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.పుష్ప నుండి ఐకాన్ స్టార్‌గా పిలవబడుతున్న బన్నీ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అశేష ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా దెబ్బకి నార్త్ ఇండియాలో కూడా బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. తాజాగా బన్నీ తన లేడీ ఫ్యాన్ కోసం ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన ఫ్యాన్‌తో ఫన్నీగా మాట్లాడాడు బన్నీ. తన ఇంట్లో పని చేసే పని మనిషికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా బన్నీ సాయం చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
తాను పెద్ద స్టార్ ని అని మరచిపోయిన అల్లు అర్జున్ గర్వం ఏమాత్రం లేకుండా ఓ అమ్మాయి కోసం బన్నీ వీడియో చేశారు. నీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలి.. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ? అని అల్లు అర్జున్ ఆమెని అడగడంతో ఆమె 13వేల మంది ఉన్నారు. 20 లేదా 30 వేలు వస్తే చాలు అని బన్నీకి తెలిపింది. ఒకే 30 ఫిక్స్ అంటూ బన్నీ సెల్ఫీ వీడియో తీయగా, ఈ వీడియోని బన్నీ పని మనిషి తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. బన్నీ చేసిన పనికి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు అల్లు అర్జున్. ఉదయాన్నే బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశాడు బన్నీ. అల్లు అర్జున్‌ను చూడగానే అక్కడ ఉన్న ఓటర్లంతా ఆప్యాయంగా పలకరించగా వారితోను సరదాగా గడిపాడు బన్నీ. అందరినీ నవ్వుతూ విష్ చేసి తన ఓటు వేసి సైలెంట్‌గా వెళ్లిపోయాడు .ఇక ప్రస్తుతం పుష్ప2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప2కి గాను ఆయన ఆస్కార్ దక్కించుకుంటాడని చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…