Actress Hema : నందమూరి బాలకృష్ణతో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రస్తుతం అన్‌స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్న విషయం విదితమే. దీనికి ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు ఫ్యామిలీ రాగా, రెండో ఎపిసోడ్‌లో నాని వచ్చి అలరించాడు. ఇక మూడో ఎపిసోడ్‌లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వచ్చి రచ్చ చేశారు. దీంతో ఈ షోకు మంచి టాక్ లభిస్తోంది.
ఇలాంటి షోలు మాత్రమే కాకుండా.. ఆహా ప్లాట్‌ఫాం వైవిధ్య భరితమైన వెబ్ సిరీస్‌లను కూడా ప్రసారం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల 3 రోజెస్ అనే వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేశారు. నవంబర్ 12 నుంచి ఈ సిరీస్ ఆహాలో ప్రసారం అవుతోంది. స్వతంత్ర భావాలు ఉన్న ముగ్గురు అమ్మాయల జీవితాల గురించి ఈ సిరీస్‌లో చూపించారు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి పర్యవేక్షణలో ఈ సిరీస్‌ను తీశారు కనుక బోల్డ్ కంటెంట్ కు ఇందులో కొదువేమీ లేదనే చెప్పాలి.
ఇక ఈ సిరీస్‌లో పాయల్ రాజ్‌పూత్, పూర్ణ, ఈషా రెబ్బలు ముగ్గురు అమ్మాయిల పాత్రల్లో నటించారు. కాగా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందులో సదరు నటీమణులతోపాటు సినీ నటి హేమ కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే స్టేజిపై హేమ బోల్డ్‌గా మాట్లాడింది. ఈ సిరీస్ దర్శకుడిని బాబూ.. చిట్టీ అంటూ సంబోధిస్తూ బోల్డ్ డైలాగ్స్ మాట్లాడేసరికి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్స్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
ఇక ఇటీవలే హేమ మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఎన్నికల సందర్భంగా నటి హేమ శివ బాలాజీ చేయి కొరకడం చర్చనీయాంశంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…