Actress Hema : స్టేజీ మీదే అంద‌రి ముందు అలా మాట్లాడేసిన హేమ‌.. అంద‌రూ షాక‌య్యారు..!

December 6, 2021 10:36 AM

Actress Hema : నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం ప్ర‌స్తుతం అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. దీనికి ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. మొద‌టి ఎపిసోడ్‌కు మంచు ఫ్యామిలీ రాగా, రెండో ఎపిసోడ్‌లో నాని వ‌చ్చి అల‌రించాడు. ఇక మూడో ఎపిసోడ్‌లో హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం వ‌చ్చి ర‌చ్చ చేశారు. దీంతో ఈ షోకు మంచి టాక్ ల‌భిస్తోంది.

Actress Hema that type of comments on 3 roses web series director

ఇలాంటి షోలు మాత్ర‌మే కాకుండా.. ఆహా ప్లాట్‌ఫాం వైవిధ్య భ‌రిత‌మైన వెబ్ సిరీస్‌ల‌ను కూడా ప్ర‌సారం చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌ల 3 రోజెస్ అనే వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేశారు. న‌వంబ‌ర్ 12 నుంచి ఈ సిరీస్ ఆహాలో ప్ర‌సారం అవుతోంది. స్వతంత్ర భావాలు ఉన్న ముగ్గురు అమ్మాయ‌ల జీవితాల గురించి ఈ సిరీస్‌లో చూపించారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు మారుతి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ సిరీస్‌ను తీశారు క‌నుక బోల్డ్ కంటెంట్ కు ఇందులో కొదువేమీ లేద‌నే చెప్పాలి.

ఇక ఈ సిరీస్‌లో పాయ‌ల్ రాజ్‌పూత్‌, పూర్ణ‌, ఈషా రెబ్బ‌లు ముగ్గురు అమ్మాయిల పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ వెబ్ సిరీస్ స‌క్సెస్ మీట్‌ను తాజాగా నిర్వ‌హించారు. ఇందులో స‌ద‌రు న‌టీమ‌ణుల‌తోపాటు సినీ న‌టి హేమ కూడా పాల్గొంది. ఈ క్ర‌మంలోనే స్టేజిపై హేమ బోల్డ్‌గా మాట్లాడింది. ఈ సిరీస్ ద‌ర్శ‌కుడిని బాబూ.. చిట్టీ అంటూ సంబోధిస్తూ బోల్డ్ డైలాగ్స్ మాట్లాడేస‌రికి అక్క‌డ ఉన్న‌వారంతా ఒక్క‌సారిగా షాక‌య్యారు. ప్ర‌స్తుతం హేమ చేసిన కామెంట్స్ తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక ఇటీవ‌లే హేమ మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన విష‌యం విదిత‌మే. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌టి హేమ శివ బాలాజీ చేయి కొర‌క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment