తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాన్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక భాష వచ్చి ఉండాలి. వివిధ పోస్టులను బట్టి వయస్సు పరిమితి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
అభ్యర్థులను వారు పాల్గొన్న క్రీడల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం కోసం https://tsposts.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…