తెలంగాణలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ..

సెప్టెంబర్ 16, 2021 11:01 ఉద.

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాన్, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ సర్కిల్ లో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ..

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక భాష వచ్చి ఉండాలి. వివిధ పోస్టులను బట్టి వయస్సు పరిమితి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

అభ్యర్థులను వారు పాల్గొన్న క్రీడల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం కోసం https://tsposts.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment