తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్ లో చోటు చేసుకున్న చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ ఘటనపై ప్రత్యేకంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే ఆ చిన్నారిపై అంతటి దారుణానికి పాల్పడిన రాజు అనే నిందితుడు చనిపోయాడు. రైల్వే ట్రాక్ మీద అతని మృత దేహం కనిపించింది. అతని చేతిపై ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా అతను రాజు అని పోలీసులు నిర్దారించారు.
రాజు కోసం ఓ వైపు రాష్ట్రం మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతను తాజాగా ఉప్పల్ సమీపంలో కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారించారు. అయితే అతని మృత దేహం స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై కనిపించింది. ప్రజలు అతన్ని చుట్టు ముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిందితుడు రాజుపై ఇప్పటికే రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. అతన్ని పట్టిస్తే ఆ మొత్తం ఇస్తామని తెలిపారు. కానీ అతను రైల్వే ట్రాక్‌పై చనిపోయి కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…