బిగ్ బ్రేకింగ్‌.. సైదాబాద్ ఘ‌ట‌న నిందితుడు రాజు ఆత్మ‌హత్య‌.. రైల్వే ట్రాక్‌పై మృత‌దేహం..

September 16, 2021 11:19 AM

తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్ లో చోటు చేసుకున్న చిన్నారిపై అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విదిత‌మే. జాతీయ మీడియా సంస్థ‌లు కూడా ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌త్యేకంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేశాయి. అయితే ఆ చిన్నారిపై అంత‌టి దారుణానికి పాల్ప‌డిన రాజు అనే నిందితుడు చ‌నిపోయాడు. రైల్వే ట్రాక్ మీద అత‌ని మృత దేహం క‌నిపించింది. అత‌ని చేతిపై ఉన్న ప‌చ్చ బొట్టు ఆధారంగా అత‌ను రాజు అని పోలీసులు నిర్దారించారు.

బిగ్ బ్రేకింగ్‌.. సైదాబాద్ ఘ‌ట‌న నిందితుడు రాజు ఆత్మ‌హత్య‌.. రైల్వే ట్రాక్‌పై మృత‌దేహం..

రాజు కోసం ఓ వైపు రాష్ట్రం మొత్తం పోలీసులు జ‌ల్లెడ ప‌ట్టారు. ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేసి ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే అత‌ను తాజాగా ఉప్ప‌ల్ స‌మీపంలో క‌నిపించిన‌ట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్దారించారు. అయితే అత‌ని మృత దేహం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై క‌నిపించింది. ప్ర‌జ‌లు అత‌న్ని చుట్టు ముట్ట‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన అత‌ను రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

నిందితుడు రాజుపై ఇప్ప‌టికే రూ.10 ల‌క్ష‌ల రివార్డును ప్ర‌క‌టించారు. అత‌న్ని ప‌ట్టిస్తే ఆ మొత్తం ఇస్తామ‌ని తెలిపారు. కానీ అత‌ను రైల్వే ట్రాక్‌పై చ‌నిపోయి క‌నిపించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మ‌రికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment