SBI Recruitment 2021 : డిగ్రీ చ‌దివిన వారికి ఆఫ‌ర్‌.. ఎస్‌బీఐలో జాబ్స్‌..!

SBI Recruitment 2021 : దేశంలోనే అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్యోగాల‌కు సంబంధిచిన నోటిఫికేష‌న్స్‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా డిగ్రీ పాసైన వారికి జాబ్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. 1226కు పైగా స‌ర్కిల్‌ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల‌కు గాను ఎంపిక ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎస్‌బీఐ స‌ర్కిల్ బేస్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీలో భాగంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 1226 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వేత‌నం రూ.36,100 నుంచి రూ.63,840 వ‌ర‌కు ల‌భిస్తుంది. ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. డిసెంబ‌ర్ 1, 2021 నాటికి ఏదైనా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్లు ప‌ని చేసి ఉండాలి. అలాగే డిసెంబర్‌ 1, 2021 నాటికి 21-30 సంవత్సరాల వ‌యస్సును క‌లిగి ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్‌బీఐ సీబీవో ఆఫీస‌ర్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను 3 ద‌శ‌ల్లో ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌, స్క్రీనింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. దీన్ని నాలుగు విభాగాల్లో మొత్తం 120 మార్కులకు నిర్వ‌హిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌/ఎకానమీ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు 2 గంట‌ల స‌మ‌యం కేటాయించారు.

ఇక రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్‌ పరీక్ష ముగిసిన తర్వాత మరో 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లిష్‌ భాషపై 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహి స్తారు. ఈ డిస్క్రిప్టివ్‌ పరీక్షలో భాగంగా అభ్యర్థులు లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖాస్తు, అనుభవం, ధ్రువపత్రాలను స్కీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. సంస్థ కోరుకుంటున్న ఉద్యోగ అనుభవం అభ్యర్థికి ఉందని కమిటీ సంతృప్తి చెందితేనే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. త‌రువాత రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూల‌కు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన అంశాలపై అవగాహన, బ్యాంకింగ్‌ రంగంపై పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. అభ్యర్థుల‌ను రాత పరీక్ష, ఇంటర్వ్యూల‌లో సాధించిన మార్కులను వెయిటేజీ ఆధారంగా క్రోడీకరించి.. తుది విజేతలను ప్రకటిస్తారు.

రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు. ఆ తర్వాత తుది విజేతలను ఖరారు చేస్తారు. ఇక సంబంధిత రాష్ట్రానికి చెందిన అధికారిక భాషపై లాంగ్వేజ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఆ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 10వ‌ తరగతి, 12వ తరగతులను సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివి ఉంటే వారికి ఈ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి ముందుగా 6 నెలల ప్రొబేషన్‌ ఉంటుంది. ఈ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. ఇలా పూర్తిస్థాయి నియామకం ఖరారైన వారికి జూనియర్‌ మేనేజ్‌ మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-1 హోదా కల్పిస్తారు. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్ వంటి ప‌దోన్న‌తుల‌ను పొంద‌వ‌చ్చు.

మ‌రింత స‌మాచారం..

ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021 కాగా కాల్‌ లెటర్‌: జనవరి 12, 2022 నుంచి ఇస్తారు. ప‌రీక్ష తేదీ: జనవరి 2022లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ల‌లో ఉంటాయి. ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2022 రెండో వారం/మూడో వారంలో ఉంటాయి. పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి/ఏప్రిల్ లో ఉంటాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM

టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన

భారత్‌, శ్రీలంకలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…

Sunday, 18 January 2026, 11:34 AM