Railway Recruitment 2024 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈరోజు మేము మీకోసం ఒక నోటిఫికేషన్ తీసుకువచ్చాము. ఈ నోటిఫికేషన్ వివరాలని పూర్తిగా చూసి, ఆసక్తి, అర్హత ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్ పలు పోస్టుల కోసం దరఖాస్తులుని ఆహ్వానిస్తోంది. ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్లో అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు, ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా చూసేద్దాము. మొత్తం 3,105 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతోంది. జనవరి 14, 2024 వరకు వుంది. ఇక అర్హత వివరాలు చూస్తే.. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50% మార్కుల తో 10వ తరగతి లేదా దానికి సమానమైన 10+2 పరీక్షా విధానంలో పూర్తి చెయ్యాలి.
అలానే, NCVT/SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.136 గా వుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ.36 చెల్లించాలి. అభ్యర్థులు WCR అధికారిక నోటిఫికేషన్ ని చూడచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా మీద ఆధార పడి ఉంటుంది.
ఫోటోగ్రాఫ్, సంతకం JPG ఫార్మాట్‌లో వుండే విధంగా చూసుకోండి. ఫైల్ పరిమాణం 50kb కంటే తక్కువ, 200kb కంటే ఎక్కువ ఉండకుండా చూడండి. 160 x 70 పిక్సెల్ పరిమాణం లో సంతకం ఉండాలి. NCVT/SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్, మార్క్ షీట్ ని కూడా అప్లోడ్ చెయ్యాల్సి వుంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూడవచ్చు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…