Railway Recruitment 2024 : టెన్త్ పాస్ అయినవాళ్ళకి గుడ్ న్యూస్.. ఇండియన్‌ రైల్వేలో అప్రెంటిస్‌ పోస్టులు..!

December 20, 2023 11:34 AM

Railway Recruitment 2024 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈరోజు మేము మీకోసం ఒక నోటిఫికేషన్ తీసుకువచ్చాము. ఈ నోటిఫికేషన్ వివరాలని పూర్తిగా చూసి, ఆసక్తి, అర్హత ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్ పలు పోస్టుల కోసం దరఖాస్తులుని ఆహ్వానిస్తోంది. ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ డివిజన్లో అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు, ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా చూసేద్దాము. మొత్తం 3,105 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతోంది. జనవరి 14, 2024 వరకు వుంది. ఇక అర్హత వివరాలు చూస్తే.. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50% మార్కుల తో 10వ తరగతి లేదా దానికి సమానమైన 10+2 పరీక్షా విధానంలో పూర్తి చెయ్యాలి.

Railway Recruitment 2024 know the educational qualification and other details
Railway Recruitment 2024

అలానే, NCVT/SCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.136 గా వుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు రూ.36 చెల్లించాలి. అభ్యర్థులు WCR అధికారిక నోటిఫికేషన్‌ ని చూడచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా మీద ఆధార పడి ఉంటుంది.

ఫోటోగ్రాఫ్, సంతకం JPG ఫార్మాట్‌లో వుండే విధంగా చూసుకోండి. ఫైల్ పరిమాణం 50kb కంటే తక్కువ, 200kb కంటే ఎక్కువ ఉండకుండా చూడండి. 160 x 70 పిక్సెల్ పరిమాణం లో సంతకం ఉండాలి. NCVT/SCVT జారీ చేసిన ITI సర్టిఫికేట్, మార్క్‌ షీట్ ని కూడా అప్లోడ్ చెయ్యాల్సి వుంది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now