ఏపీలో ఆ ప్రభుత్వ విభాగంలో 70 పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే !

September 2, 2021 7:23 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నేషనల్‌ హెల్త్ మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం శుభవార్తను తెలియజేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో 14 టెలీ మెడిసిన్‌ హబ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 70 పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా సెప్టెంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://hmfw.ap.gov.in/ అనే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పీడియాట్రీషియన్‌ – 14, గైనకాలజిస్ట్‌ – 14, జనరల్‌ ఫిజీషియన్‌ – 14, మెడికల్‌ ఆఫీసర్లు – 28 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు లక్ష రూపాయల వేతనం చెల్లిస్తారు. మెడికల్ ఆఫీసర్ లకు నెలకు 53 వేల రూపాయల జీతం చెల్లించనున్నారు. అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు spmuaprect@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి రిక్వెస్ట్‌ పంపి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 6 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment