నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ తీపికబురును తెలిపింది.వరసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 350 నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీకి.. 50 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్సుల్లో.. నావిక్, యాంత్రిక్ 02/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 350 పోస్టులను భర్తీ చేయనుంది.
పై తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి. https://joinindiancoastguard.gov.in/
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 50 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.గ్రౌండ్ డ్యూటీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ విభాగం అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 14వ తేదీ 2016 లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించండి. https://joinindiancoastguard.gov.in/
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…