మన దేశంలో వీసా, మాస్టర్ కార్డ్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాడడం వల్ల వినియోగదారుల నుంచి వ్యాపారులు 2 శాతం పన్ను వసూలు చేస్తారు. ఎందుకంటే వారు ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలి. ఇక బ్యాంకులు వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలకు చార్జిలను చెల్లిస్తారు. అందుకనే ఆ కార్డులను వాడినప్పుడు మన నుంచి కొందరు వ్యాపారులు చార్జిలను వసూలు చేస్తారు. అయితే రూపే విధానం భారత్‌కు చెందినది. అందువల్ల రూపే ఆధారిత కార్డులను వాడేటప్పుడు మనకు చార్జిలు పడవు. ఈ విషయాన్ని రూపే కార్డులు వాడేవారందరూ తెలుసుకోవాలి.
ఇక రూపే డెబిట్ కార్డులు ఉన్నవారికి కార్డు రకాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అది ఉచితంగానే వస్తుంది. దాన్ని వినియోగదారుడు ప్రమాదం జరిగిన 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం వల్ల ఖాతాదారుడు మరణిస్తే అతని నామినీలకు ఇన్సూరెన్స్ వస్తుంది. లేదా గాయాలు అయి వైకల్యం చెందితే ఇన్సూరెన్స్ కవరేజి ఇస్తారు. ఇలా రూపే డెబిట్ కార్డులకు ఇన్సూరెన్స్ పనిచేస్తుంది.
ఇక రూపే డెబిట్ కార్డులతో వచ్చే ఈ ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పొందాలంటే ఖాతాదారులు ఆ కార్డులను ఎప్పుడూ వాడుతుండాలి. ప్రమాదం జరగడానికి 90 రోజుల ముందు వ్యవధిలో ఎప్పుడైనా కనీసం ఒక్కసారి అయినా కార్డును వాడి ఉండాలి. దీంతో ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇక ప్రమాదం జరిగాక ధ్రువపత్రాలను 60 రోజుల్లోగా సబ్‌మిట్ చేయాలి. దీంతో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా రూపే డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ పనిచేస్తుంది.
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య…
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్‌లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…