నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 10వ త‌ర‌గ‌తి, డిగ్రీ, బీటెక్ చ‌దివిన వారికి ఇండియన్ కోస్ట్ గార్డులో భారీగా ఉద్యోగాలు..!

July 9, 2021 8:25 PM

నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ తీపికబురును తెలిపింది.వరసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 350 నావిక్, యాంత్రిక్  పోస్టుల భర్తీకి.. 50 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సుల్లో.. నావిక్, యాంత్రిక్ 02/2022 బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 350 పోస్టులను భర్తీ చేయనుంది.

పై తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి. https://joinindiancoastguard.gov.in/

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 50 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రౌండ్‌ డ్యూటీ, టెక్నికల్‌ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.గ్రౌండ్‌ డ్యూటీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్‌ విభాగం అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 14వ తేదీ 2016 లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించండి. https://joinindiancoastguard.gov.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment