10 పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త.. మిలటరీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

July 15, 2021 2:17 PM

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు చేయాలనీ కోరుకునే అమ్మాయిలకు ఇది ఒక శుభవార్త.ఉమెన్ మిలిటరీ పోలీస్‌లో సోల్జర్ జనరల్ డ్యూటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 100 ఉద్యోగాలకు 10 పాసైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి అంబాలా, లక్నో, జబల్‌పూర్, బెల్గామ్, పూణె, షిల్లాంగ్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులకు మెయిల్ వస్తుంది. మీ అడ్మిట్ కార్డులో ఉన్న తేదీ రోజు మీరు ఈ ప్రాంతానికి చేరుకుంటే సరిపోతుంది.

మొత్తం ఖాళీగా ఉన్న 100 పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పని సరిగా పది ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు మధ్య ఉండాలి.ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://joinindianarmy.nic.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment