రెండు తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

September 11, 2021 11:24 PM

ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న 109 సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్‌ సైట్‌ను సందర్శించవచ్చు. https://www.apmaheshbank.com. పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ను బట్టి వయస్సు 40 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ మెయిల్ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. recruit@apmaheshbank.com మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 24 2021.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment