ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ..

July 15, 2021 10:30 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన జడ్జిలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు,పర్సనల్‌ సెక్రటరీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ద్వారా హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 21 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 25 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల జీతం చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 21వ తేదీలోగా, దరఖాస్తును రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు–522237 చిరునామాకు పంపించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://hc.ap.nic.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment