అమెజాన్ అందిస్తున్న ఈ ఉచిత కోర్సు చేయండి.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో జాబ్ పొందండి..!

August 20, 2021 9:01 PM

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ పేద విద్యార్థులు, యువ‌త కోసం అద్బుత‌మైన కోర్సును ఉచితంగా అందిస్తోంది. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ కింద క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్ష‌ణ‌ను అందిస్తోంది. ఈ శిక్ష‌ణ అంతా ఉచితం. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు చెందిన ప‌లు అంశాల్లో శిక్ష‌ణ‌ను ఇస్తారు.

అమెజాన్ అందిస్తున్న ఈ ఉచిత కోర్సు చేయండి.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో జాబ్ పొందండి..!

ఈ కోర్సులో రెజ్యూమ్ రాయ‌డం, ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు అయ్యేట‌ప్పుడు పాటించాల్సిన మెళ‌కువ‌లు, డేటాబేస్ స్కిల్స్, లైన‌క్స్‌, పైథాన్‌, సెక్యూరిటీ, నెట్‌వ‌ర్కింగ్ వంటి అంశాల్లో శిక్ష‌ణ ఇస్తారు. ఈ కోర్సులో చేరే వారికి ఎలాంటి టెక్నాల‌జీ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన ప‌నిలేదు. ఎవ‌రైనా, ఏ వ‌య‌స్సు వారైనా ఇందులో చేరి ఉచితంగా శిక్ష‌ణ తీసుకోవ‌చ్చు.

శిక్ష‌ణ కాల‌వ్య‌వ‌ధి 12 వారాలు. శిక్ష‌ణ పూర్తి అయ్యాక ప‌లు సంస్థ‌ల‌తో మాట్లాడి అమెజాన్ అభ్య‌ర్థుల‌కు ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 52 న‌గ‌రాల్లో రానున్న రోజుల్లో 29 మిలియ‌న్ల మందికి క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్ష‌ణ‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా అమెజాన్ ముందుకు సాగుతోంది.

ఈ శిక్ష‌ణ పూర్తి చేసిన వారికి కంపెనీల్లో ఎంట్రీ లెవ‌ల్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి. ఇది పేద విద్యార్థులు, యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అమెజాన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

39 thoughts on “అమెజాన్ అందిస్తున్న ఈ ఉచిత కోర్సు చేయండి.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో జాబ్ పొందండి..!”

Leave a Comment