నిరుద్యోగ అభ్యర్థులకు భారత రైల్వే ప్రభుత్వ శాఖ శుభవార్తను తెలియజేసింది. బెంగళూరుకు చెందిన భారత రైల్వే ప్రభుత్వ శాఖ రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్‌లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 13వ తేదీకి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల నెలా స్టయిఫండ్ రూ.12,261 చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు-560064 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ 13 ఆఖరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. rwf.indianrailways.gov.in.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…