రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ..

August 26, 2021 4:33 PM

నిరుద్యోగ అభ్యర్థులకు భారత రైల్వే ప్రభుత్వ శాఖ శుభవార్తను తెలియజేసింది. బెంగళూరుకు చెందిన భారత రైల్వే ప్రభుత్వ శాఖ రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, సంబంధిత ట్రేడ్‌లలో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 13వ తేదీకి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల నెలా స్టయిఫండ్‌ రూ.12,261 చెల్లించనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్, రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు-560064 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ 13 ఆఖరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు. rwf.indianrailways.gov.in.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now