బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అందుకనే వారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు, ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఆ మాటకొస్తే కొందరు పురుషులకు కూడా అవి అంటే ఇష్టమే. అయితే బంగారానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం బంగారం మాత్రమే పసుపు లేదా బంగారం రంగులో ఉంటుంది. ఇతర లోహాలు కొన్ని ఆ రంగులో ఉన్నా అవి ఆక్సీకరణం చెందితే ఇతర రంగుల్లోకి మారుతాయి.
సుమారుగా 20 కోట్ల ఏళ్ల కిందట భూమిపై పడిన గ్రహ శకలాల వల్ల భూమిలో బంగారం ఏర్పడింది.
చిన్న బంగారం ముక్క నుంచే ఎంతో పొడవైన తీగను తయారు చేయవచ్చు. కేవలం 28 గ్రాముల బంగారంతో సుమారుగా 8 కిలోమీటర్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు.
బంగారం ఒక లోహం అయినప్పటికీ దాన్ని ఆహార పదార్థాలు, పానీయాలతో కలిపి తినవచ్చు. బంగారం విష పదార్థం కాదు.
స్వచ్ఛమైన 100 శాతం బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం అంటారు. అదే 18 క్యారెట్ల బంగారం అంటే అందులో 75 శాతం మేర బంగారం ఉంటుంది. 14 క్యారెట్ల బంగారంలో 58.5 శాతం, 10 క్యారెట్ల బంగారంలో 41.7 శాతం బంగారం ఉంటుంది. మిగిలినవి వెండి, ప్లాటినం, కాపర్, జింక్, పల్లేడియం, నికెల్, ఐరన్, కాడ్మియం వంటివి ఉంటాయి.
బంగారం ఎంతకాలం అయినా క్షీణించకుండా అలాగే ఉంటుంది. గాలి, తేమ, యాసిడ్ ప్రభావాలకు లోనుకాదు. అనేక రకాల యాసిడ్స్ ఇతర లోహాలను కరిగిస్తాయి. కానీ బంగారం మాత్రం ఆక్వారీజియా అనే మిశ్రమంలో మాత్రమే కరుగుతుంది.
బంగారం అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, దాన్ని ఇతర వస్తువులు, పదార్థాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, డెంటిస్ట్రీ, మెడిసిన్, రేడియేషన్ షీల్డింగ్, కలరింగ్ గ్లాస్ కోసం కూడా బంగారం వాడుతారు.
అత్యంత స్వచ్ఛమైన బంగారానికి వాసన, రుచి ఉండవు. అందువల్లే బంగారం ఎలాంటి ప్రభావానికి లోనుకాదు.
స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. చేత్తో కూడా మడత పెట్టవచ్చు. బంగారం 1064 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. 2850 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో సుమారుగా 9071 టన్నుల మేర బంగారం ఉంటుందని అంచనా.
బంగారు ఆభరణాలను ధరిస్తే దురద పెట్టదు. దురద వచ్చిందంటే అందులో ఇతర లోహాలు కలిసినట్లు అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న బంగారంలో 75 శాతం బంగారాన్ని 100 ఏళ్ల కిందే వెలికి తీశారు.
ప్రపంచంలో అత్యంత బరువైన గోల్డ్ బార్ బరువు 250 కిలోలు. దాన్ని మిత్‌సుబిషి మెటీరియల్స్ కార్పొరేషన్ తయారు చేసింది.
సూర్యకాంతి, నీళ్లు కలిపి బంగారం ఏర్పడుతుందేమోనని అప్పట్లో గ్రీకులు నమ్మేవారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసిన దేశం సౌతాఫ్రికా.
భూమికి దగ్గరలో సైక్ 16 అనే గ్రహ శకలం ఉంది. అందులో సుమారుగా 20 బిలియన్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పలు ఇతర మూలకాలతోనూ బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. కానీ అది చాలా ఖరీదైన ప్రక్రియ.
ప్రపంచ వ్యాప్తంగా భూమిలో ఇప్పటికీ 80 శాతం బంగారం అలాగే ఉంది. మానవ శరీరంలో 0.2 శాతం మేర బంగారం ఉంటుంది.
బంగారు ఉంగరాలను ధరిస్తే వాటి నుంచి వారానికి 0.12 మిల్లీగ్రాముల చొప్పున రాలిపోతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…