ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి ఎన్నికల విషయం హాట్ టాపిక్ గా మారింది. మా అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నువ్వా నేనా అంటూ పోటీపడుతూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అధ్యక్ష పదవి కోసం చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ పదవి కోసం మాటల తూటాలను పేలుస్తూ విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఐదు మంది పోటీ చేయడం గమనార్హం. ఈ ఐదుగురు అభ్యర్థులు నువ్వానేనా అంటూ పోటీలలో దిగనున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరగాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా నటి హేమ ప్రస్తుత మా అధ్యక్షుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న మా అసోసియేషన్ త్వరలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. మా అధ్యక్ష పదవికి అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని భావించిన సభ్యులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మా అధ్యక్షుడు నరేష్ అధికారికంగా వెల్లడించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…