కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగించారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ లేదు. కానీ దాదాపుగా అలాంటి పరిస్థితే ఉంది. ఇక కర్ణాటకలో తాజాగా 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు కానుంది. అయితే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ లాక్‌డౌన్ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో మే 1వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను విధిస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు సైంటిస్టులు, వైద్య నిపుణులు, మేథావులు ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ఈ విషయంపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడిన తరువాత హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. అయితే కేంద్రం మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలను వేస్తామని చెప్పాక సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పౌరులకు ఉచితంగా టీకా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చర్యలు చేపడుతున్నారు. కానీ రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెరిగిపోతున్న కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. అందువల్ల కేసీఆర్ ఈ విషయంపై మరో 3, 4 రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
లాక్ డౌన్ విధించడం, మహారాష్ట్ర తరహా కఠిన ఆంక్షలను అమలు చేయడం లేదా ప్రస్తుతం ఉన్న స్థితినే కొనసాగించడం.. ఈ మూడు విషయాల్లో ఏదో ఒక దాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించేది లేదని గతంలో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కనుక సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠను కలిగిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…