తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు చేస్తారా ? సీఎం కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ?

April 27, 2021 1:04 PM

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశంని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగించారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ లేదు. కానీ దాదాపుగా అలాంటి పరిస్థితే ఉంది. ఇక కర్ణాటకలో తాజాగా 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు కానుంది. అయితే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ విధిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

lock down may be imposed in telangana cm kcr to take decision

కోవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో మే 1వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను విధిస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు సైంటిస్టులు, వైద్య నిపుణులు, మేథావులు ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు. అయితే సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు.

సీఎం కేసీఆర్‌ కోవిడ్‌ బారిన పడిన తరువాత హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. అయితే కేంద్రం మే 1 నుంచి దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలను వేస్తామని చెప్పాక సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని పౌరులకు ఉచితంగా టీకా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడికి రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చర్యలు చేపడుతున్నారు. కానీ రాత్రి కర్ఫ్యూ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెరిగిపోతున్న కేసుల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. అందువల్ల కేసీఆర్‌ ఈ విషయంపై మరో 3, 4 రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

లాక్‌ డౌన్‌ విధించడం, మహారాష్ట్ర తరహా కఠిన ఆంక్షలను అమలు చేయడం లేదా ప్రస్తుతం ఉన్న స్థితినే కొనసాగించడం.. ఈ మూడు విషయాల్లో ఏదో ఒక దాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించేది లేదని గతంలో సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు కూడా స్పష్టం చేశారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కనుక సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠను కలిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment