గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ఎంత మందికి సహాయం చేశాడో అందరికీ తెలిసిందే. సోనూసూద్ అలా చేయడం వల్ల రీల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ హీరో అయ్యాడు. అయితే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలోనూ సోనూ తన సహాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ ప్రజలకు సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకు రావాలని కోరుతున్నాడు.
ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మా దగ్గర 25-30 మంది టెక్నిషియన్లు ఉన్నారు. వారు రోజుకు 24 గంటలూ పనిచేస్తున్నారు. దేశంలో అవసరం ఉన్నవారికి సహాయం అందిస్తున్నారు. ఎవరైనా సహాయం కావాలని ఫోన్ చేస్తే వెంటనే మా టీమ్ స్పందిస్తోంది. వారికి కావల్సిన ప్లాస్మా, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర వైద్య సామగ్రితోపాటు అవసరం అయిన సహాయం చేస్తున్నాం.. అని సోనూసూద్ అన్నాడు.
ఇక దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఎంతో మంది సహాయం కోసం చూస్తున్నారని, అలాంటి వారందరినీ ఆదుకునేందుకు కేవలం కొద్ది మంది సహాయం సరిపోదని, కనుక చాలా చాలా మంది సెలబ్రిటీలు, సామాజిక వేత్తలు, దాతలు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని సోనూసూద్ కోరాడు. మరి సెలబ్రిటీలు సోనూ పిలుపుకు స్పందిస్తారో, లేదో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…